BhadrachalamTelangana

ఆటోను ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు…

ఆటోను ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

లక్ష్మీపురం సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.

ఆటోను ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.

ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

మార్చ్ 06,

బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం వద్ద బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైబాద్ నుంచి వస్తున్న ఆటోని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎనక నుంచి బలంగా ఢీ కొట్టడం తో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటా హుటిన ఖమ్మం తరలించారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ నుంచి వస్తున్న టీఎస్ 28 టి 7306 నెంబర్ గల ప్యాసింజర్ ఆటో మహబూబాద్ నుంచి వస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చే శ్రీకృష్ణ ట్రావెల్ చెందిన ప్రైవేట్ బస్సు ఎనక నుండి బలంగా ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర కాయాలు కాగా ఆటో నడుపుతున్న

చిన్నూరు సతీష్ కి తలకు వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నూరు సతీష్ కి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. సంబంధింత సంఘటనపై బూర్గంపాడు పోలీస్స్టేషన్లో బాధితుడు తల్లి చెన్నూరు వెంకటరమణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button