HyderabadPoliticalTelangana

ఐదో అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య

ఐదో అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య

ఐదో అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Web desc : హైదరాబాద్ శివారులో విషాదం నెలకొంది. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం వెస్ట్ గాంధీనగర్‌లోని భవానీ ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో వడ్లకొండ ఆనందచారి – అరుణ దంపతులు నివసిస్తున్నారు.

వారి కూతురు దీక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని, బెంగళూరు సమీపంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ ఆప్తాల్మాలజీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈ నెల 17వ తేదీన ఇంటికి వచ్చి దీక్షిత.. శుక్రవారం మధ్యాహ్నం వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఇది గమనించిన కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన దీక్షితను.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ దీక్షిత మృతిచెందింది.

ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవని.. ఎవరిపైనా అనుమానాలు లేవని దీక్షిత తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button