KhammamPoliticalTelangana

పలు కుటుంబాలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరామర్శ

పలు కుటుంబాలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరామర్శ

పలు కుటుంబాలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరామర్శ

  • అండగా ఉంటామని అభయం

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం రూరల్: అనారోగ్యం, వివిధ కారణాలతో ఖమ్మం రూరల్ మండలంలో మృతి చెందిన వారి ఇళ్లకు కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తొలుత సత్యనారాయణపురంలో మెట్ట సుదర్శన్ రెడ్డి, అనుముల రావనరసమ్మ ఇళ్లకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.

ఆ తర్వాత రెడ్డి పల్లి లో ఉప్పల కృష్ణ, అనుముల కౌసల్యల గృహాల్లో ఓదార్చారు. ఎంవీ. పాలెం లో, కాచిరాజు గూడెంలో పలు కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గురై.. చికిత్స పొందుతున్న కనకటి నారాయణరెడ్డి ని పరామర్శించారు.

ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరూ అధైర్య పడవద్దని..మంత్రి పొంగులేటి శీ నన్న అందరికీ అండగా ఉంటారని అభయమిచ్చారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తారని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button