HyderabadPoliticalTelangana

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలు

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలు

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలు

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు తీవ్ర గాయలయ్యాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఎన్నికల సమావేశం అనంతరం భోజనాలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం సమావేశానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి భోజనాలు చేసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో చికెన్‌ కర్రీ వేసుకునేందుకు వెళ్లిన మండల పరిధిలోని కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త గొర్రెంకల మల్లయ్య కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు.

ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన కార్యకర్తలు ఆయనను వెంటనే వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button