EducationNotificationTelangana

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్ : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఫలితాలను విడుదల చేయనున్నారు.

మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్‌(క్వాలిఫయింగ్ టెస్ట్)
అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్‌)
అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్)
అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)
అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button