Andhra PradeshPolitical

మానవత్వం చాటుతున్న గంగవరం ఉద్యోగులు

మానవత్వం చాటుతున్న గంగవరం ఉద్యోగులు

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం జూలై 4సి కె న్యూస్ ప్రతినిధి

గంగవరం మండల ప్రజా పరిషత్ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ పంపిణీ లో భాగంగా కొందరు ఉద్యోగులు మానవత్వం చాటుకొని సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు.

మేలుమాయి పంచాయతీ చిన్నమనాయన పల్లి కి చెందిన పెన్షన్ లబ్ధిదారుడు శ్రీరాములు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి లో కేన్సర్ చికిత్స పొందుతుండగా అదే సచివాలయం నందు పని చేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ రాకేష్ తిరుపతి కి వెళ్లి సదరు వ్యక్తికి పించన్ అందజేశారు.

కల్లుపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర మూర్తి వేలూరు CMC హాస్పిటల్ నందు చికిత్స లో ఉండగా అదే సచివాలయం నందు పని చేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ అన్నూరు శ్రావణి అక్కడికి చేరుకొని సదరు పెన్షన్ దారుకు ఫించన్ అందించారు.

మమడుగు పంచాయతీ కంచిరెడ్డిపల్లి కు చెందిన బి.శాంతమ్మ స్విమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతుండగ అదే సచివాలయం నందు పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి మహిళా పోలీస్ షణ్ముగ ప్రియ తిరుపతి ఆసుపత్రికి వెళ్లి ఫించన్ అందజేశారు.

ఇబ్బందుల్లో ఉన్న ఫించన్ దారులకు, ప్రభుత్వం అందజేసిన పెన్షన్ మొత్తాన్ని వ్యయ ప్రయాసలకోర్చి అందజేసి మానవత్వం చాటుకున్న ఉద్యోగులను పలమనేరు ఏపీఎన్జీజిఓ సంఘం అధ్యక్షులు ఆనందబాబు ప్రత్యేకంగా అభినందించారు.

వీరితో పాటు రికార్డు స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసిన మండలం నందలి అందరు గ్రామ సచివాలయ ఉద్యోగులను గంగవరం ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఈఓ పీఆర్డీ తిరుమల గోపాల ప్రసాద్ అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button