MuluguPoliticalTelangana

బొగత జలపాతం లో యువకుడి మృతి

బొగత జలపాతం లో యువకుడి మృతి

బొగత జలపాతం లో యువకుడి మృతి

సి కె న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతం లోయలో పడి యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది.

వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన తోటి మిత్రులైన సాయి కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ, గౌస్ కలిసి చీకుపల్లి బొగతను సందర్శించడానికి వచ్చారు.

బొగత అందాలను తిలకించిన వీరు బొగతలో స్నానం చేసేందుకు దిగారు.వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో జస్వంత్ నీటమునిగి గల్లంతయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండార్ కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైనది.

ఈ యువకుడు వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసివచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button