KhammamPoliticalsuryapetaTelangana

మఠంపల్లి వాసికి రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్

మఠంపల్లి వాసికి రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్

హర్షం వ్యక్తం చేసిన వారి మిత్రులు

మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా జనరల్ సెక్రెటరీ
వస్కుల రామయ్య

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ గా కండె వెంకటేశ్వర్లు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఆగస్టు 23

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ గా మఠంపల్లి వాసి న్యాయవాది కండె వెంకటేశ్వరరావును నియమించడం పట్ల వారి మిత్రులు మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా జనరల్ సెక్రటరీ వస్కుల రామయ్య (జయరాజ్)ఆనందం వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్
నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కండె వెంకటేశ్వరరావు
ఖమ్మం జిల్లా కేంద్రంలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా tఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కండె వెంకటేశ్వరరావు కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ గా మరియు హ్యూమన్ రైట్స్ ఆర్టిఐగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ సంజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాది వెంకటేశ్వరరావు విలేకరులతో చరవాణి లో మాట్లాడుతూ తన నియామకం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు తెలంగాణ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఖమ్మం జిల్లా మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button