HealthHyderabadPoliticalTelangana

ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిన మహిళ

ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిన మహిళ

ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిన మహిళ

నిజామాబాద్ గ్రామీణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు సోమవారం జిల్లా కేంద్రంలో పూలంగ్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

నిరసన చేపట్టుతుండగా ఓ మహిళ నిరసన కార్యక్రమంలోకి చొరబడి డిచ్ పల్లికి చెందిన అశోక్ కుమార్ అనే ఆర్ఎంపీ వైద్యుడిపై చెప్పుతో దాడి చేసింది.
ట్రీట్​మెంట్​ కోసం వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు వ్యక్తిని వందల మంది చూస్తుండగా ఆగ్రహంతో బుద్ధి చెప్పింది.

ఆర్ఎంపీ, పీఎంపీలపై సర్కార్ ఆంక్షలు పెట్టిందని, సర్టిఫికెట్లు ఇచ్చి ట్రీట్​మెంట్​కు అనుమతించాలని, మెడికల్ కౌన్సిల్​ పెట్టిన పోలీస్​ కేసులు ఎత్తేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం నిజామాబాద్​ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పులాంగ్ చౌరస్తా నుంచి ఎన్​టీఆర్ చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో జిల్లావ్యాపంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.

ర్యాలీ పూర్తై యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా వచ్చిన మహిళ అశోక్​పై చెప్పుతో దాడి చేసింది. వైద్యం పేరుతో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అశోక్ దుర్మార్గుడని ఆర్ఎంపీల సంఘానికి పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడని మండిపడింది.

ఈ అనూహ్య ఘటనతో ర్యాలీలో పాల్గొన్న వందలాది మందితో పాటు అక్కడున్న పోలీసులు నిశ్చేష్ఠులయ్యారు. తనపై దాడి చేసిన మహిళపై యాక్షన్​ తీసుకోవాలని అశోక్​ వన్​ టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button