HyderabadPoliticalTelangana

అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం..

అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం..

అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అందరూ నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఓ అపార్ట్ మెంట్ లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది.

ఫస్ట్ ఫ్లోర్ లో 101వ ఫ్లాట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది.
అక్కణ్నుంచి మంటలు, పొగ మెల్లమెల్లగా అపార్ట్ మెంట్ అంతా వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కూకట్ పల్లిలోని హిల్ టాప్ అపార్ట్ మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినట్లు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు..

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 20 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్ మెంట్ లో 60 మంది చిక్కుకున్నారు. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో బయటకు తీసుకువచ్చేందుకు ఆటంకం ఏర్పడింది.

దీంతో 60 మంది టెర్రస్ పైకి ఎక్కించి సురక్షితమైన స్థలంలో ఉంచి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 ఫైర్ ఇంజిన్లతో దాదాపు గంట పాటు శ్రమించి మంటలకు అదుపులోకి తెచ్చారు.

ఆ తర్వాత టెర్రస్ పై ఉన్న అపార్ట్మెంట్ వాసులను సురక్షితంగా కిందికి దించారు. మంటలను ముందే గమనించి అప్రమత్తం అవ్వడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. తీవ్ర ఆస్తినష్టం జరిగినట్లు కాలనీ వాసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button