Mahabub badPoliticalTelangana

భూమి తగాదా.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు..

భూమి తగాదా.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు..

భూమి తగాదా.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు..

ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత తమ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు.

ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు.

మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్‌, మహేశ్‌ ఉన్నారు. లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు.

పలుమార్లు పంచాయితీలు, పోలీస్‌ స్టేషన్‌లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్‌ సర్వేనంబర్‌ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్‌కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు.

కానీ, నరేశ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్‌ నుంచి సీరోలుకు వచ్చాడు.

బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్‌, మహేశ్‌, వారి భార్యలు, కాంపల్లికి చెందిన నున్న వీరన్న(నరేశ్‌ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు.

అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్‌ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..

మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button