అంగన్ వాడి టీచర్ పై ఆర్మీ వ్యక్తి లైంగిక దాడి ?

అంగన్ వాడి టీచర్ పై ఆర్మీ వ్యక్తి లైంగిక దాడి ?;

By :  Ck News Tv
Update: 2025-03-03 05:19 GMT

అంగన్ వాడి టీచర్ పై ఆర్మీ వ్యక్తి లైంగిక దాడి ?

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను మిలటరీ వ్యక్తి వేధింపులు చేస్తున్నాడట. దీంతో ఆత్మహత్యే శరణ్యం అంటూ అంగన్ వాడి టీచర్ ఓ వీడియో విడుదల చేసింది.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామానికి చెందిన పార్వతిని వినోద్ అనే మిలటరీ వ్యక్తి వేధింపులు చేస్తున్నాడట. భర్త లేకపోవడంతో అంగన్ వాడి టీచర్ గా కుటుంబాన్ని పోషించుకుంటోంది పార్వతి.

ఇక అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి… వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది పార్వతి. తనకు వినోద్ నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు బాధితురాలు. ప్రభుత్వం సహాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పార్వతి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Similar News