గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!
గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!;
గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!
ఏపీ గవర్నర్ కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు.వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా సరే గవర్నర్ విజయవంతంగా తన ప్రసంగం పూర్తి చేశారని కొనియాడారు.
"అసెంబ్లీలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే, వివేకా హత్య గుర్తొచ్చింది" అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు అలా ప్రవర్తించడమేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "వైసీపీ నేతలు గొడవలకు, అసభ్య పదజాలానికి పర్యాయ పదంగా మారిపోయారు. చంద్రబాబు ఇలాంటి వారిని తట్టుకుని ఇన్నేళ్లు ఎలా నిలబడగలిగారు? నిన్నటి ఘటన తర్వాత ఇది నాకు కలిగిన అనుభూతి. ఆయన ధైర్యానికి, తెగువకు హ్యాట్సాఫ్" అని వ్యాఖ్యానించారు.
"గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు, వైసీపీ నేతలు ఆయన కళ్లలోకి చూసే ధైర్యం చేసేవారా? చట్టాలు రూపొందించాల్సిన వారు స్వయంగా వాటిని ఉల్లంఘిస్తే ఎలా?" అని పవన్ నిలదీశారు. "నిన్న అసెంబ్లీలో జరిగిన గొడవ చూస్తుంటే, వైసీపీ విధ్వంస విధానం మరోసారి గుర్తొచ్చింది. ప్రజావేదిక కూల్చివేత, 200 పైగా ఆలయాల ధ్వంసం, డాక్టర్ సుధాకర్ మృతి, జంగారెడ్డిగూడెం కల్తీ సారా మృతులు, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం, పత్రికాధిపతులపై దాడులు, మడ అడవుల విధ్వంసం, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన తీరు, అమరావతి రైతులపై లాఠీఛార్జ్, తిరుపతి కల్తీ లడ్డూ ఘటన- ఇవన్నీ వైసీపీ దమనకాండకు ఉదాహరణలు" అని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
"అసెంబ్లీలోనే ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తే, బయట ఇంకా ఎన్ని అరాచకాలు జరిగే ఉంటాయి? ఈ పరిస్థితి మారాలి. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని మమ్మల్ని అధిక మెజారిటీతో ఇక్కడ కూర్చోబెట్టారు. సంకీర్ణ ప్రభుత్వం అంటే సవాళ్లతో కూడుకున్నది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. కలిసే ఉంటాం. 15 ఏళ్లు పాటు కూటమిగానే కలిసే అధికారంలో ఉంటాం. ఏపీ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం.. మేము కలిసి లేకపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లే. ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రం అభివృద్ధికి కట్టుబహడి ఉన్నాం.రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేదు.. ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లండి. గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీళ్లేదు. " అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు