ప్రియుడి ఇంటి ముందు మహిళ ఆందోళన

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు;

By :  Ck News Tv
Update: 2025-03-03 05:13 GMT

ప్రియుడి ఇంటి ముందు మహిళ ఆందోళన

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు

భర్త అకాల మరణంతో ఆమె ఒంటరి అయ్యింది. నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసుకుని అండగా ఉంటానని ఓ యువకుడు నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకుని, బిడ్డ పుట్టిన తరువాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఆదివారం ఆ యువకుడి ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఇందుకు సంబంధించి ఆమె తెలిపిన వివరాలిలా వున్నాయి.

దీంతో ఆమె ఆదివారం ఆ యువకుడి ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఇందుకు సంబంధించి ఆమె తెలిపిన వివరాలిలా వున్నాయి. చోడవరం పట్టణంలోని గాంధీగ్రామం సిటిజన్‌ కాలనీకి చెందిన మొల్లి నూకరత్నం భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. అప్పటికి వీరికి పిల్లలు కలగలేదు.

భర్త చనిపోయిన తరువాత ఆమె స్థానికంగా ఒక బట్టల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్నది. ఈ దుకాణానికి ఎదురుగా కొమ్మోజు సతీశ్‌ అనే యువకుడు బైక్‌ మెకానిక్‌ షాపు నడుపుతున్నాడు. మూడేళ్ల క్రితం నూకరత్నంతో పరిచయం ఏర్పరచుకుని, ప్రేమిన్నానని చెప్పాడు. కొంతకాలం తరువాత అతని మాటలు నమ్మి, ఆమె కూడా ప్రేమించడం మొదలుపెట్టింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్ష్మీపురంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లోనే మూడుముళ్లు వేసి పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. అనంతరం కాపురం కూడా చేయడంతో నూకరత్నం గర్భం దాల్చింది. తరువాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఆస్పత్రిలో ప్రసవం సందర్భంగా బిడ్డ తండ్రిగా సతీశ్‌ పేరు నమోదు చేయాలని ఆమె కోరగా, అప్పటినుంచి ముఖం చాటేశాడు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, నూకరత్నంతో కాపురం చేసేందుకు అతను అంగీకరించలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం ఉదయం బిడ్డతో సహా గాంధీగ్రామంలో సతీశ్‌ ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఈ సందర్భంగా నూకరత్నం మీడియాతో మాట్లాడుతూ, సతీశ్‌కు గతంలోనే పెళ్లయ్యిందని, కానీ ఈ విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడని, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి దూరంగా వుంటున్నాడని చెప్పింది.

అతనిపై అనకాపల్లి దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ హాజరుకాకుండా తిరుగుతున్నాడని ఆరోపించింది. గత్యంతరం లేని స్థితిలో బిడ్డతో కలిసి న్యాయం కోసం ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పింది. కాగా సతీశ్‌ ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న నూకరత్నంను మాజీ ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ, గాంధీగ్రామం, నరసయ్యపేట సర్పంచ్‌లు గాడి అప్పారావు, ఉగ్గిన నాగబాబు, వైసీపీ నాయకులు శ్రీకాంత్‌, బైన ఈశ్వరరావు తదితరులు పరామర్శించారు. నూకరత్నంకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Similar News