పలమనేరు నియోజకవర్గం ప్రతినిది
సైకిల్ పై దివ్యాంగుడైన, కుప్పం తాలూకా ,శాంతిపురం మండలం కు చెందిన, ఏ. బాలకృష్ణ చలో విజయవాడ అనే నినాదంతో ....బ్యానర్ ఏర్పాటు చేసుకుని, ట్రై సైకిల్ పై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి కుప్పం నుండి వెళుతూ.... పలమనేరు కుప్పం రహదారిలో సి కె న్యూస్ ప్రతినిధి అతన్ని పలకరించగా....
తనది కుప్పం తాలూకా, శాంతిపురం మండలం అని, తన పేరు ఏ .బాలకృష్ణ అని, పుట్టుకతో ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అని, తన భార్య కూడా వికలాంగురాలని, తనకున్న ఒకే ఒక కూతురు కూడా, బ్రెయిన్ లో నీరు చేరడంతో ఆమె కూడా ఇబ్బందులు పడుతోందని, తన కష్టాలను ఏకరువు పెట్టడానికి, ట్రై సైకిల్ పై, కుప్పం నుండి విజయవాడకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి వెళుతున్నానని, తన కష్టాన్ని చెప్పుకొచ్చాడు.
ఎంతోమందికి సహాయం చేసిన పవన్ కళ్యాణ్, నన్ను కూడా ఆదుకుంటాడని, మెగా ఫ్యామిలీకి ఆ దయాపూరితమైన హృదయం ఉందని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశాడు.
మార్గమధ్యంలో తెలుగుదేశం, జనసేన నాయకులు నన్ను పలకరిస్తూ .....నాకు బిస్కెట్లు తినడానికి ఆహార పదార్థాలు ఇస్తున్నారని, ఈ సందర్భంగా, దివ్యాంగుడైన ఏ బాలకృష్ణ తెలియజేశాడు.
600 కిలోమీటర్లు ట్రై సైకిల్ పై, దివ్యాంగుడైన వ్యక్తి వెళ్లడం చూసి ,ఆ చుట్టుపక్కల ప్రజలు చలించిపోయారు.కచ్చితంగా పవన్ కళ్యాణ్ అతనిని ఆదుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.