భద్రాచలం గోదావరి నది దగ్గర మృత దేహం లభ్యం
భద్రాచలం గోదావరి నది దగ్గర మృత దేహం లభ్యం;
By : Ck News Tv
Update: 2025-03-25 05:12 GMT
భద్రాచలం గోదావరి నది దగ్గర మృత దేహం లభ్యం
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
భద్రాచలం గోదావరి నది దగ్గర మృత దేహం లభ్యమయ్యింది. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి పేరు సాయి వయస్సు సుమారు 45 సంవత్సరాలు అని తెలిసింది.
స్థానిక రూపా స్కూల్ పరిసర ప్రాంతంలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం అతను స్థానిక బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలియవచ్చింది. ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ కారణం ఇంకా తెలియరాలేదు. ఈ విషయం తెలియగానే స్థానిక పోలీసులు స్మిమ్మర్ కరకు ప్రసాద్ సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.