భద్రాచలం ఘటనపై మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి
భద్రాచలం ఘటనపై మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి;
భద్రాచలం ఘటనపై మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి
చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రి తుమ్మల ఆరా
సి కె న్యూస్ ప్రతినిధి సాయి కౌశిక్
భద్రాచలం పట్టణములో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తీవ్ర దిగ్బంతుని వ్యక్తం చేశారు హైదరాబాదులో ఉన్న మంత్రి తుమ్మల భద్రాచలం లో జరిగిన ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు శిధిలాలు కింద చిక్కుకున్న కార్మికులను వెంటనే ఆసుపత్రికి చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి తుమ్మల అధికారులు ఆదేశించారు దక్షిణ అయోధ్యగా పేరు కావున భద్రాచలంలో ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని చనిపోయిన కుటుంబాలకు మంత్రి తన తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పరిస్థితి పూర్తిగా పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల అధికారులు ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు