*మేడ్చల్ నగరంలో దారుణ హత్య*
నగరశివారు మేడ్చల్‌లో పట్టపగలు దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.
ఉమేష్ (25)ను ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.