మా భూములు మాకు ఇప్పించండి మహ ప్రభో కలెక్టరేట్ ముందు బాధితుల ఆందోళన
మా భూములు మాకు ఇప్పించండి మహ ప్రభో కలెక్టరేట్ ముందు బాధితుల ఆందోళన;
మా భూములు మావేనని.. చిక్కుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం!
రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య అరాచకాలపై పేదలు నిరసన గళమెత్తారు. ఆక్రమించుకున్న తమ ఇళ్ల స్థలాలను తిరిగి అప్పజెప్పాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పోరాటానికి దిగారు.
ఈ ఆందోళనకు వామపక్ష సీపీఎం తమ మద్దతు ప్రకటించింది.
దివంగత మహానేత వైఎస్సార్(YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఇందుకుగానూ ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వే నెంబర్ 189, 203లో 20 ఎకరాలను 577 మందికి పంపిణీ చేశారు. అయితే.. 2007 నుంచే ఆ స్థలాలను రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యం తమ గుప్పిట్లో ఉంచుకుంది.
అప్పటి నుంచి వాళ్ల పోరాటం కొనసాగుతూనే వస్తోంది. అయితే.. లబ్ధిదారులను తమ ప్లాట్ల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మాణం చేసుకుంది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. దీంతో.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్సార్ హయాంలో కేటాయించిన.. ఆ ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలంటూ కలెక్టర్‌ను డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.