జాయింట్ కమిషనర్ రాసలీలలు... వీడియో వైరల్..

By :  Ck News Tv
Update: 2025-02-21 08:13 GMT

జాయింట్ కమిషనర్ రాసలీలలు... వీడియో వైరల్..

హైదరాబాద్ జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో కలిసి ఉన్న సమయంలో భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు.

ఓ అమ్మాయితో రూములో ఉండగా.. భార్య కళ్యాణి భర్త జానకి రామ్ ను పట్టుకొని ఇద్దరినీ చితకబాదారు. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో ఓ అమ్మాయితో కమిషనర్ జానకి రామ్ ఉంటున్నాడు.

తన భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టింది. సికింద్రాబాద్ వారాసి గూడలో అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

జానకిరామ్ ఎక్కడ పని చేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని, భార్య కళ్యాణి ఆరోపించింది. గొడవ జరుగుతున్న ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు..

Similar News