పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన అతనిపై కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన అతనిపై కేసు నమోదు;
పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన అతనిపై కేసు నమోదు
తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన కొమ్ము శ్రావణి D/o ఉపేందర్, వయస్సు 25 సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.... కొమ్ము శ్రావణి కి గత నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయినది.
వివాహమైన 16 రోజులకే తన భర్త వేరే మహిళతో వెళ్ళిపోవడంతో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నది. గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన తన మేనత్త కొడుకైనా చిర్రా మహేష్ తమ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడని,
నువ్వంటే ఇష్టమని,నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా వాడుకొని గర్భవతిని చేసి, పాప పుట్టిన తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఆ పాప నాకు పుట్టలేదని చెబుతున్నాడని తెలిపింది.
మూడు నెలల పాపను తీసుకుని మహేష్ ఇంటికి వెళ్ళగా, మహేష్, అతని తల్లిదండ్రులు, చెల్లెలు అందరూ కలిసి నువ్వు మా ఇంటికి రావద్దు...వస్తే నిన్ను చంపుతామని బెదిరించారు.
కావున నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన చిర్రా మహేష్ మరియు అతని కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్య తీసుకుని నాకు న్యాయం చేయగలరని ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్.