కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన జిల్లా,నగర కాంగ్రెస్ నాయకులు.
కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన జిల్లా,నగర కాంగ్రెస్ నాయకులు;
కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన జిల్లా,నగర కాంగ్రెస్ నాయకులు.
ఖమ్మం నగరం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు.
మొన్న అసెంబ్లీలో స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారు.
గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు, లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు.
దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు.
ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు,ఖమ్మం నగర అధ్యక్షులు మొహమ్మద్.జావేద్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ గా వెళ్లి కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్దం చేయడం జరిగింది
.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బాల.సౌజన్య, ఖమ్మం జిల్లా బి సి సెల్ అధ్యక్షులు పుచ్చకాయలు. వీరభద్రమ్,కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్క.శేఖర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా.సురేష్ నాయక్,నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల.లక్ష్మణ్,మహిళా నాయకురాల్లు,కార్పొరేటర్ లు,అనుబంధ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.