ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు మృతి

By :  Ck News Tv
Update: 2025-02-20 06:51 GMT

ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు మృతి

ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా

నేలకొండపల్లి డిగ్రీ కాలేజ్ సమీపంలో మినీహైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద అటుగా వెళ్లిన స్థానికులు కాలువలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు మండల కేంద్రంలోని పీఎస్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు గంటా నరేష్ (36)గా గుర్తించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Similar News