జర్నలిస్టులు ఇక ఉద్యమాలకు సిద్ధం కావాలి
జర్నలిస్టులు ఇక ఉద్యమాలకు సిద్ధం కావాలి;
*జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలి*
*ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు డిమాండ్*
*ఇళ్ల స్థలాల కేటాయింపులో నిర్లక్ష్య వైఖరికి చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు*
*సి కె న్యూస్ ప్రతినిధి శ్రీ దేవి*
ఖమ్మం ఫిబ్రవరి 17 : *ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల స్థలాన్ని తక్షణమే జర్నలిస్టులకు అప్పగించి స్థలాలను పంపిణీ చేయాలని, అందుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేయాలని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధికారులను డిమాండ్ చేశారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులు సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్నారని, గత సర్కార్ జర్నలిస్టులకు 23.2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసి జీవోను విడుదల చేసిందని, కానీ రోజురోజుకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హౌసింగ్ సొసైటీ కి తక్షణమే భూమిని అప్పగించి జర్నలిస్టులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు .
మూడు జర్నలిస్ట్ యూనియన్లు, హౌసింగ్ కమిటీ, ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీతో సమన్వయంగా వ్యవహరించి సమస్య పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. సభ్యత్వాలు రాని జర్నలిస్టులకు తక్షణమే సభ్యత్వాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాల సాధన కోసం ఇకపై దశల వారి ఆందోళనలు నిర్వహించాలని, అందుకు అవసరమైన జేఏసీ ని ఏర్పాటు చేయాలని కోరారు. దశలవారి ఉద్యమం లో జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, పలు విభాగాలకు చెందిన జర్నలిస్టు మిత్రులు పాల్గొని ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అందుకు అవసరమైన చొరవ మూడు యూనియన్లు, హౌసింగ్ కమిటీ తీసుకోవాలని సూచించారు.
ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల భూమిని జర్నలిస్టులకు అప్పగించే అంశంలో తీవ్ర నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా జర్నలిస్టులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టి జె ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, సీనియర్ డెస్క్ జర్నలిస్టులు నారాయణ రావు, ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ పాషా, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శులు మూల జీవన్ రెడ్డి, మేడి రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, సూర్య బ్యూరో సత్యనారాయణ, మహిళ ప్రతినిధులు వంగూరి ఈశ్వరి, రోజా, శ్రీదేవి, జర్నలిస్టు నాయకులు సంతోష్, అంతోటి శ్రీనివాస్, పానకాలరావు, తిరుపతి రావు, గోవింద్, వెంకటరెడ్డి, హుస్సేన్, వెంకటాద్రి, నాగేష్, గణేష్, సూర్య, శ్రీధర్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, ఉపేందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.