జ్యూనియర్ ను చితకబాదిన సీనియర్లు
జ్యూనియర్ ను చితకబాదిన సీనియర్లు;
జ్యూనియర్ ను చితకబాదిన సీనియర్లు
తాము పెట్టిన సినిమా చూడలేదని జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదిన గటన ఖమ్మం జిల్లాలోని పెనుబంక మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కుప్పెనకుంట్ల గ్రామంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ వసతి గృహంలో జరిగింది ఈ ఘటన.
ఓ విద్యార్థి పై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
శనివారం రాత్రి వసతి గృహంలో సినిమా వేసే క్రమంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే సీనియర్లు పెట్టిన సినిమా చూడకుండా ఒక విద్యార్థి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ''మేము పెట్టిన సినిమా చూడకుండా వెళ్లిపోతావా'' అని ఆవేశంతో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిపై ఐదుగురు సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మోచేతికి గాయాలయ్యాయి. హాస్టల్ సిబ్బంది గాయపడిన విద్యార్థిని పెనుబల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడికి పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై వి ఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో 109,118(1),r/w 190 Bns సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.