తప్పుడు వ్యవహారం సరికాదు..
- దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు
- కొందరు కావాలనే వారి వ్యక్తిగత స్వలాభం కోసం పాలుపంచుకున్నారు
- ఇటువంటి సో కాల్డ్ నేతలు ప్రజలు నమ్మొద్దు
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల ఓ ఫ్లాట్ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు సో కాల్డ్ నేతలు వ్యవహరించిన తీరుతో తమ పార్టీకి సంబంధం లేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ అన్నారు. అమాయక దళితులను వీరి స్వలాభం కోసం ముందుకు నెట్టి ఆఖరికి వారిపై కేసులు చేపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకెందుకు మీ వెనక మేమున్నామంటూ.. నమ్మబలికి ఆఖరికి నట్టేట ముంచారన్నారు. తప్పిదం కళ్ళకు కట్టినట్టు కనిపించినప్పటికీ అది మంచిదే అన్నట్లు ప్రోత్సహించడాన్నీ తప్పు పట్టారు. ఈ సందర్భంలో అధికారులపై సైతం తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. తప్పుడు వ్యవహారంపై కేసులు నమోదైతే కేసులు చేస్తే ... అవాస్తమని మీడియాని నమ్మించే పద్ధతిలో మాట్లాడడం సరికాదన్నారు . తమది అధికార పార్టీ అని చెప్పి తప్పుడు పనులకు పాల్పడే వారిని ప్రజలు నమ్మొద్దని సూచించారు. నిజాన్ని నిగ్గు తేల్చిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ వ్యవహారంలో పాలుపంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూసిన వారిపై జిల్లా పార్టీ , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గారి దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.