నా చావుకు ఢీ షో డాన్సర్ కారణం అంటూ యువతి సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్
నా చావుకు ఢీ షో డాన్సర్ కారణం అంటూ యువతి సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్;
నా చావుకు ఢీ షో డాన్సర్ కారణం అంటూ యువతి సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో విషాదం....
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన....
ఢీ షో లో డాన్సర్ అభి నే కారణం అంటూ సూసైడ్ ముందు సెల్ఫీ లో పేర్కొన్న యువతి....
ఖమ్మం జిల్లా పొన్నెకల్లులో కావ్యా కల్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. సినీ రంగంలో డాన్సర్ గా గుర్తింపు పొందేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్న ఆమె..
ఢీ వంటి డాన్స్ షోలలో ప్రతిభ చూపేవారు. మంచి భవిష్యత్ ఉందని ఊళ్లో వాళ్లంతా అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ప్రాణాలు తీసుకున్నారు. దాంతో కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.
అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుందో వారికి అర్థం కాలేదు. హైదరాబాద్ లో ఎన్ని కష్టాలు పడుతుందో ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమి వచ్చిందో తెలుసుకోవాలని ఆమె ఫోన్ ను ఓపెన్ చేసి చూశారు కుటుంబసభ్యులు. అందులో ఉన్న వీడియో చూసి అసలు కారణం తెలుసుకున్నారు. తీసుకెళ్లి వీడియోను పోలీసులకు ఇచ్చి కేసు పెట్టారు.
కావ్యా కల్యాణి డాన్సర్ గా ఉంటూ ఢీ షోలో పాల్గంటున్న సమయంలో అక్కడే మేల్ డాన్సర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభి అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొద్ది రోజులగా దగ్గర అయ్యాడు.కలసి ఉందామని సహజీవనం కూడా ప్రారంభించాడు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఐదేళ్ల పాటు బాగానే ఉన్నా.. ఇటీవలి కాలంలో అభి మరో అమ్మాయి మోజులో పడ్డాడు.
కావ్యా కల్యాణిని పట్టించుకోవడం మానేశాడు. ఇంటికి కూడా రావడం లేదు. అభితో సహజీవనం చేస్తూ.. అభి కెరీర్ కోసం సాయం చేస్తూ.. తన డాన్స్ కెరీర్ ను కూడా కావ్యా కల్యాణి నిర్లక్ష్యం చేశారు.
అటు కెరీర్ లో వెనుకబడిపోవడంతో పాటు ఇప్పుడు అభి కూడా మోసం చేయడంతో కావ్యా కల్యాణి తట్టుకోలేకపోయారు.తనకు జరిగిన అవమానం.. అభిచేసిన మోసం గురించి వీడియో తీసుకున్నారు.
ఉరి వేసుకోవడానికి రెడీ అయిన తర్వాత ఆ వీడియో తీశారు. చాలా ఆవేదనతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆ వీడియోరికార్డు చేసుకుని తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.
తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరొ యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని బలన్మరణానికి పాల్పడ్డ మంగళగిరి కావ్యకళ్యాణి(24)....
మృతురాలు స్వస్థలం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీ....
నిందితుడి స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం పోన్నెకల్...
5 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో నగరంలోని మామిల్లగూడెం లోని సాయిబాబా గుడి సమీపంలో సహజీవనం....
ఇటీవల కాలంలో పొన్నేకలు మకాం మార్చిన కుటుంబ సభ్యులు...
అభిలాష్ కు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దం అయినా కుటుంబ సభ్యులు....
విషయం తెలుసుకున్న కల్యాణి పొన్నెకల్ లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో వురి వేసుకొని ఆత్మహత్య....
ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ లో యువతి మృతదేహం....