విద్యార్థుల పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు..

మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది;

By :  Ck News Tv
Update: 2025-02-11 05:05 GMT

విద్యార్థుల పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు..

మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్ లో విద్యార్థుల పై కొన్ని సంవత్సరాల నుండి ప్రిన్సిపాల్ రవీందర్ రావు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థి సంఘాలు తెలిపాయి.

విద్యార్థులను ప్రిన్సిపాల్ రూమ్ కి పిలుచుకుని ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేస్తూ విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నాడని విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగాయి. ప్రిన్సిపల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. నిందితుడు ప్రిన్సిపాల్ రవీందర్ రావు పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.

ప్రిన్సిపాల్ రవీందర్ రావు వివరణ : తన పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, 26 సంవత్సరాల నుండి తన పై తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని, విద్యార్థిని మందలించడానికి మాత్రమే బెల్ట్ పట్టుకుని లాగాను తప్ప తప్పుగా ప్రవర్తించలేదు అన్నారు.

Similar News