స్పందన లేని అధికారులు పట్టించుకోని నాయకులు

కబ్జా కోరల్లో దేవాలయ భూమి ... చోద్యం చూస్తున్న అధికారులు !;

By :  Ck News Tv
Update: 2025-02-11 13:58 GMT

*స్పందన లేని అధికారులు పట్టించుకోని నాయకులు*

*కబ్జా కోరల్లో దేవాలయ భూమి ... చోద్యం చూస్తున్న అధికారులు !*

*వెలి జర్లలో దేవాలయ భూముల దుర్వినియోగం... గ్రామస్తుల ఆవేదన*

*ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు.. ప్రశ్నించని పాలకులు!*

*కబ్జా కోరల్లో ఆలయ భూములు.. కొమ్ముకాస్తున్న అధికారులు.?*

సి కే న్యూస్ షాద్ నగర్ : ఫిబ్రవరి11

షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలోని దేవాలయ భూములు అక్రమార్కుల చేతిలో అన్యాక్రాంతమవుతున్నాయి. కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తుండగా, బాధ్యత వహించాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...వెలి జర్ల గ్రామానికి చెందిన దేవాదాయ శాఖ సర్వే నెంబర్ 39/19 నంబరులో ఉన్న 3 ఎకరాల 15 గుంటల ఆలయ భూమిలో కొంతభాగాన్ని ఆక్రమించి, కొందరు గోడ నిర్మించసాగారు.

గ్రామస్థులు వెంటనే స్పందించి ఎండోమెంట్ శాఖ, ఫరూఖ్ నగర్ ఎమ్మార్వో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు భూ సర్వే చేపట్టకుండా కాలయాపన చేస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తిగా ఆగకపోవడంతో, అధికారులే కబ్జాదార్లకు సహకరిస్తున్నారా ? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నిరసనతో కొన్ని గంటల పాటు పనులు ఆగినప్పటికీ, మరుసటి రోజు తిరిగి కొనసాగించినట్టు తెలుస్తోంది.దేవాలయ భూములను తక్షణమే రక్షించాలని,అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ,కబ్జాదార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులే నిద్ర వ్యవస్థలో ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి, ఈ అక్రమ కబ్జాలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News