మళ్లీ కులగణన సర్వే

మళ్లీ కులగణన సర్వే;

By :  Ck News Tv
Update: 2025-02-12 13:08 GMT

తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే.. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే.. ఎప్పటినుంచంటే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్‌పై చేసిన ప్రకటనపై అటు ప్రతిపక్షాలు.. ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. దీంతోపాటు.. మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. కులగణన సర్వే రిపోర్ట్‌ చరిత్రాత్మకమని ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్‌పై చేసిన ప్రకటనపై అటు ప్రతిపక్షాలు.. ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. దీంతోపాటు.. మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. కులగణన సర్వే రిపోర్ట్‌ చరిత్రాత్మకమని ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సర్వేలో బీసీల జనాభా గణనీయంగా తగ్గడంపై బీసీ సంఘాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 3.1 శాతం మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదని.. వారి కోసం మళ్లీ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుండి 28 వరకు కులగణన రీ సర్వే చేపట్టనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Similar News