మరో ప్రజా పోరాటం రాబోతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మరో ప్రజా పోరాటం రాబోతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్;
తెలంగాణలో మరో ప్రజా పోరాటం రాబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా..
నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ నేడు ఆ పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో(Telangana Bhavan) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకోసం పోరాటం చేయగల పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2028లో అధికారంలోకి వచ్చేది 100 శాతం తామే అని, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వెనక్కి పయనిస్తోందని అన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు.
పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubly Celebrations) ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అదే విధంగా.. పార్టీలో మహిళా కమిటీలు(BRS Woman Committees) ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆయా కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావు(Harish Rao)ను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించి.. పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని కేసీఆర్ తెలియ జేశారు.