రంజాన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదు : రాజసింగ్

రంజాన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదు : రాజసింగ్;

By :  Ck News Tv
Update: 2025-02-18 11:24 GMT

రంజాన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదు : రాజసింగ్

రంజాన్ పండుగ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదు అని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకు వరకే ఉద్యోగం చేసుకునేలా సర్కులర్ ఇచ్చారు.

ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి ని అడుగుతున్నాను.. దేవీ నవరాత్రి హిందువులకు అతిపెద్ద పండుగ. తొమ్మిది రోజులు ఒక్కపొద్దు ఉంటారు. అప్పుడు ఇలాంటి జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు. హిందూ పండుగలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరాత్రిలో జాగరణ చేస్తే కేసులు బుక్ చేస్తుంది.

కొన్ని రోజుల ముందే మీ పోలీస్ కమిషనర్ మీటింగ్ పెట్టి హిందూ పండుగలలో సౌండ్ సిస్టం పెడితే కేసులు బుక్ చేస్తామన్నారు. ఈ సంవత్సరం రామనవమి రోజు సౌండ్ సిస్టం పెడితే మమ్మల్ని కూడా లోపల వేస్తామని వార్నింగ్ మీ కమీషనర్ ఇచ్చారు. రంజాన్ పండగనే సీఏం రేవంత్ రెడ్డి కి కనిపించిందా.. ముస్లిం ఓట్ల వల్లే సీఏం అయిన అని అనుకుంటున్నారా.. తెలంగాణ లో హిందూ జనాభా ఎంత ఉందో సీఎంకు తెలువదా.. ఇవాళ మీరు చేస్తున్న తప్పులు వచ్చే ఎన్నికల్లో మీకు కనిపిస్తుంది. కర్ణాటకలో హిందూవుల పండుగలు.. హిందువుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారో తెలంగాణలో కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అని రాజసింగ్ అన్నారు.

Similar News