ఎమ్మెల్యే రాజసింగ్ సోషల్ మీడియా ఖాతపై నిషేధం

By :  Ck News Tv
Update: 2025-02-21 05:34 GMT

ఎమ్మెల్యే రాజసింగ్ సోషల్ మీడియా ఖాతపై నిషేధం

బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు (MLA Rajasingh's hate speeches) చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది

ఇటీవల రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయ వాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేయగా ద్వేషపూరితంగా ప్రసంగాలు చేశారని తేలింది.

ద్వేషపూరిత ప్రసంగాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల ఖాతాలపై మెటా తొలగిస్తుంది.ఫేస్‌బుక్,యూట్యూబ్ రాజాసింగ్ ద్వేషపూరిత ప్రసంగ వ్యాప్తికి ప్రధాన వేదికలుగా ఉపయోగించుకుంటున్నారని తేలింది. (Facebook and Instagram accounts) ఫేస్‌బుక్ లో రాజాసింగ్ కు చెందిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలను ఉన్నాయి.యూట్యూబ్ 211 వీడియోలున్నాయని హేట్ ల్యాబ్ గుర్తించింది.

ద్వేషపూరిత ప్రసంగాలు...

2024 లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య సీనియర్ బీజేపీ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని నివేదిక పేర్కొంది.ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5 శాతం ద్వేషపూరితమని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. రాజా సింగ్ చేసిన 259 ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో, ముఖ్యంగా భారతదేశంలోని ముస్లింలపై, మైనారిటీ వర్గాలపై హింసకు ప్రత్యక్ష పిలుపు ఇచ్చారని గుర్తించింది. రాజాసింగ్ చేసిన 219 ప్రసంగాలు మొదట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు.వీటిని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫేస్‌బుక్‌లో అత్యధికంగా 164 ప్రసంగాలు పోస్టు చేశారు. రాజాసింగ్ చేసిన మొత్తం ప్రసంగాలలో 74.9 శాతం, తరువాత యూట్యూబ్‌లో 22.4 శాతం,ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు ద్వేషపూరితమని తేల్చారు.

32 ద్వేషపూరిత ప్రసంగాలు

దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ 32 సార్లు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని తేలింది. 22 సందర్భాల్లో ముస్లింలు, క్రైస్తవులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడాడని నివేదిక వెల్లడించింది. వీటిల్లో 16 ద్వేష పూరిత ప్రసంగాలు యూట్యూబ్ లో షేర్ చేశారు. మరో 13 ప్రసంగాలు ఫేస్ బుక్ లో ఉన్నాయి.

నిషేధించిన రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాలివే...

ఫేస్‌బుక్‌లోని నిషేధించిన ఖాతాల్లో 'రాజా సింగ్ (భాగ్యనగర్) ఎమ్మెల్యే', 'రాజా సింగ్ (ధూల్‌పేట్) ఎమ్మెల్యే', 'రాజా సింగ్ యువ సేన (RSYS)''టైగర్ రాజా సింగ్ అధికారిక సమూహం'ఖాతాలు ఉన్నాయి.హిందీ భాషలో పలు ఇతర పేజీలు, గ్రూపులు, ఖాతాలకు సమిష్టిగా 1,00,000 మందికి పైగా అనుచరులు ఉన్నారని మెటా నివేదిక తెలిపింది.(Meta bans) ఇన్‌స్టాగ్రామ్‌లో రాజా సింగ్ , అతని మద్దతుదారులు నాలుగు కీలక ఖాతాలను నిర్వహించారు: @rajasinghmla, @t.usharajasinghofficial, @t.rajabhaimla1,@t.rajabhaimla3. ఈ ఖాతాలకు కలిపి దాదాపు 1,98,900 మంది ఫాలోయర్లు ఉన్నారు.

ఆది నుంచి వివాదాస్పదంగానే...

ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు. గతంలో ముస్లిం ప్రవక్తపై ద్వేషపూరితంగా మాట్లాడిన రాజాసింగ్ ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. 2020వ సంవత్సరంలోనూ రాజాసింగ్ ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వ్యక్తిగత ఖాతాలను తొలగించారు.ఫేస్‌బుక్ నియమాలను పాటించలేదని, హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తమ నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారని అందుకే ఆయన ఖాతాలపై నిషేధం విధించామని గతంలో పేస్ బుక్ ప్రతినిధి ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్' సంచలన కథనాన్ని గతంలో ప్రచురించింది.

Similar News