రైతు రుణమాఫీ డబ్బును మాయం చేసిన ఘనుడు

రైతు రుణమాఫీ డబ్బును మాయం చేసిన ఘనుడు;

By :  Ck News Tv
Update: 2025-03-28 10:14 GMT

రుణమాఫీ డబ్బులు తన ఖాతాకు మళ్లించుకున్న ఘనుడు...

సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి సహకార సంఘంలో అవకతవకలు జరిగాయి.

రైతుల రుణమాఫీ నిధులు సహాకార సంఘం బ్యాంక్ సీఈవో రాచకొండ నాగేంద్ర నేరుగా తన ఖాతాలోకి జమ చేసుకున్నాడు.

దీనిపై పీఎస్ లో కంప్లైంట్ చేశారు రైతులు.

రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయకుండా నేరుగా సీఈవో రాచకొండ నాగేంద్ర తన ఖాతాలో జమ చేసుకొని తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడని సీఈవో నాగేంద్రపై రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల సొమ్మును తిరిగి ఖాతాలో జమ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Full View

రుణమాఫీ విషయంపై అడుగుదామని సహకార సంఘానికి వెళితే విధులకు రాకుండా తప్పించుకుని బయటనే తిరుగుతున్నాడని ఆరోపిస్తున్నారు రైతులు.

గట్టిగా నిలదీసిన వారికి తన సొంత ఎకౌంటు ఫోన్ పే నుంచి విడతలవారీగా డబ్బులు ఇస్తున్నాడని చెబుతున్నారు రైతులు. సీఈవో నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

Similar News