Uncategorized

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి

చిత్తూరు జిల్లా:జనవరి 21
జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారు వాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయ పడి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున వీరమరణం పొందాడు

వరదరాజులు, సెల్వి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ (29) డిగ్రీ చదువుకుంటూ ఆర్మీలో 2017 లో చేరారు. సంక్రాతి పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపారు.

తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లాడు. ఇంతలో ఈ వార్త ఆయన కుటుం బంలో విషాదం నింపింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల కాల్పు ల్లో తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ మృతి చెందారు.

కార్తీక్ మృతితో కుటుం బంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button