HyderabadPoliticalTelangana

పోలీసులపై గొడ్డలితో దాడి…. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కాల్పులు

పోలీసులపై గొడ్డలితో దాడి.... నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కాల్పులు

పోలీసులపై గొడ్డలితో దాడి…. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కాల్పులు

హైదరాబాద్ లో మళ్లీ తుపాకుల మోత

హైదరాబాద్ నగరంలో తుపాకుల మోత మళ్లీ కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు.

దీంతో ఒక్కసారిగా పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిపై పోలీ సులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అతన్ని ఉస్మానికి ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button