KhammamPoliticalTelangana

తిర్లాపురం గ్రామంలో ఈదురుగాలుల బీభత్సం

తిర్లాపురం గ్రామంలో ఈదురుగాలుల బీభత్సం

తిర్లాపురం గ్రామంలో ఈదురుగాలుల బీభత్సం-

కరెంటు తీగలు తెగి రోడ్డు మీద పడటంవల్ల వాహనాలకు రాకపోకలు ఇబ్బందులు.

సర్పంచ్ చాపలమడుగు వీరబాబు

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని మండల పరిధిలో తిర్లాపురం గ్రామం నుండి నామవరం వెళ్లే రోడ్డుకు ఈదురుగాలుల బీభత్సం- కరెంటు పోల్స్ కు ఉన్న తీగలు తెగి రోడ్డు మీద పడటంవల్ల వాహనాలకు రాకపోకలు అంతరాయం కలిగినది. రోడ్లు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు విరిగి రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నాయి.

దీనితో తిర్లాపురం గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.ఈదురుగాలుల వల్ల విద్యుత్ తీగలు తెగి రోడ్లపై పడటం అత్యంత ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాపాయం జరగకుండా ఉండటానికి తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు తెలియపరిచారు.

తిర్లాపురం ముందు జాగ్రత్త చర్యలు : తెగిపడిన విద్యుత్ తీగలకు, కరెంటు స్తంభాలకు కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అవి కరెంట్ లేని తీగల్లా అనిపించినా, ప్రమాదకరమైన లైవ్ వైర్లు కావొచ్చు.

నీటిలో నడవొద్దు: రోడ్లపై నీరు నిలిచి ఉంటే, కరెంటు ప్రసరించే అవకాశం ఎక్కువ కాబట్టి ఆ ప్రాంతాల్లో అడుగు పెట్టవద్దు.వాహనదారులు: మీరు ప్రయాణిస్తుంటే ఆ ప్రాంతానికి దూరంగా వాహనాన్ని నిలిపివేయండి.
కరెంటు తీగలు మీ వాహనం మీద పడితే లోపల కూర్చోవడం సురక్షితం.

కిందికి దూకడానికి ప్రయత్నించవద్దు.సహాయం కోసం అత్యవసర సహాయం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం సంబంధిత విద్యుత్ బోర్డు అధికారులను లేదా స్థానిక విపత్తు నిర్వహణ బృందాలను సంప్రదించాలి. మీకు తెలియపరుస్తున్నాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button