NationalPolitical

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం?

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం?

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం?

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌ లోని ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతు న్నాయి.

సంఘటన స్థలానికి 8 అగ్గిమాపక యంత్రాలు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ మంటలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నట్టు సమాచారం

అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌ వాసులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు భవనంపై నుంచి కిందపడిపోయినట్లు తెలిసింది.

వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు.

భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయ త్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button