
పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యాకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్‌ఎస్ నాయకులు కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్‌మెయిల్ చేయిస్తున్నారని శుక్రవారం ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయవచ్చనే అనుమానంతో బీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్నారు.
హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్.. ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని బ్లాక్‌మెయిల్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవా రం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
అర్ధరాత్రి వేళ సీఎం రేవంత్‌రెడ్డి ‘మై హోం భుజా’కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై రేవంత్‌రెడ్డి కావాలనే బుర దజల్లుతున్నారని మండిపడ్డారు.
118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయించారని పేర్కొన్నారు.
అబద్ధాలు, మోసాలు వెన్నతో పెట్టిన విద్య : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ విమర్శించారు.
ఆయనకు దొంగతనం చేయడం వచ్చు, దొరికిపోవడమూ వచ్చని ఎద్దేవా చేశారు. రేవంత్ ఒక మానసిక రోగి అని, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్‌నే ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.
ఫార్ములా ఈ కారు రేసులో ఏ తప్పు జరగలేదని స్వయంగా క్యాబినెట్ మంత్రులే స్వయంగా చెప్తున్నారని తెలిపారు. రేవంత్ ఇకనైనా తన వంకరబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.