Telangana

మద్యం మత్తులో స్టేజ్ ఫై నటి ని తోసేసిన బాలకృష్ణ

మద్యం మత్తులో స్టేజ్ ఫై నటి ని తోసేసిన బాలకృష్ణ

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ మంగళవారం జరిగింది.

అయితే ఈ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన బాలకృష్ణ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అయితే స్టేజ్‌పైనే అంజలితో దురుసుగా ప్రవర్తించారు బాలకృష్ణ. స్టేజ్‌పైన అందరూ చూస్తుండగానే అంజలిని పక్కకు తోసేశారు.

దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంజలి మాత్రం నవ్వుతూ ఈ ఘటనను కవర్ చేశారు. ఇక స్టేజ్‌పైనే మద్యం సేవించారు బాలకృష్ణ. ఓ వాటర్‌ బాటిల్‌లో మద్యం కనిపించింది.

స్టేజ్ ఫై బాలకృష్ణతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ మొత్తం ఉంది. ఆ సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని బాలయ్య చెప్పారు. ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కానీ ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య. ఈ సడెన్ షాక్‌కి అంజలి కాస్త వెనక్కి తూలి భయపడింది.

ఇక వీరిద్దరి మధ్యలో ఉన్న నేహా శెట్టి అయితే దెబ్బకి బెదిరిపోయింది. వామ్మో ఏంటిది అన్నట్లుగా బిక్కచచ్చిపోతున్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అయితే అంజలి మాత్రం నవ్వుతూ అలా కవర్ చేసింది . కానీ ఆ వెంటనే బాలయ్య.. మళ్లీ అంజలితో ఏదో మాట్లాడి ఓ హైఫై ఇచ్చారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో ను వైసీపీ పార్టీ షేర్ చేస్తూ..బాలకృష్ణ మద్యం తాగి మరోసారి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. మహిళలంటే టీడీపీకి అంత చులకనా? అని ప్రశ్నించింది. నిన్న జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన కూర్చున్నచోట బాటిల్లో మద్యం ఉండడం.. అంజలిని చేతితో తోసేశారని పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button