PoliticalTelangana

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు చౌటుప్పల్ సిఐ ఎస్ దేవేందర్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు చౌటుప్పల్ సిఐ ఎస్ దేవేందర్

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

-డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు

చౌటుప్పల్ సిఐ ఎస్ దేవేందర్

Ck న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి (శ్రీనివాస్)

డిసెంబర్ 30 నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ చౌటుప్పల్ పురపాలక, మండల పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని చౌటుప్పల్ సిఐఎస్ దేవేందర్ తెలిపారు.

ప్రజలు డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జిల్లా పరిధిలో స్థానిక పోలీసులతో పాటు పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తారన్నారు.

ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని తెలిపారు.

అలాగే రోడ్లపై, వీధులలో వేడుకలు నిర్వహించుకునే సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్ల వారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి అవుతారని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవన్నారు.

అలాగే గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందన్నారు.

పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలని,దాని ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని,

ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్ల వద్దనే తమ కుటుంబ సభ్యులతో కలసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. చౌటుప్పల్ పురపాలక ,మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button