PoliticalTelangana

కమిషనరేట్‌ లో సిఐ, ఎస్ఐ లు సస్పెండ్..

కమిషనరేట్‌ లో సిఐ, ఎస్ఐ లు సస్పెండ్..

కమిషనరేట్‌ లో సిఐ, ఎస్ఐ లు సస్పెండ్..

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై ఆదివారం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సస్పెన్షన్‌ వేటు వేశారు. పర్వతగిరి సీఐగా పని చేస్తున్న ఇ.శ్రీనివాస్‌ నాయక్‌తో పాటు వీఆర్‌లో ఉన్న ఎస్సై జి.అనిల్‌కుమార్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ ఏడాది మార్చి 28న ఐనవోలు ఠాణా పరిధిలోని పంథిని గ్రామ శివారులో క్రషర్‌ వద్ద అక్రమంగా భారీ ఎత్తున నిల్వ చేసిన డీజిల్‌ను పట్టుకొన్నారు. విచారణ, కేసు నమోదు కోసం ఐనవోలు ఠాణాకు అప్పగించారు. పోలీసులు రెండ్రోజుల తరవాత కేసు నమోదు చేశారు.

నిందితులకు ఠాణా నోటీసులు ఇవ్వడం కోసం పర్వతగిరి సీఐ శ్రీనివాస్‌నాయక్, అప్పటి ఐనవోలు ఎస్సై అనిల్‌కుమార్‌ డబ్బు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో కమిషనరేట్‌లోని ప్రత్యేక విభాగం అధికారులు విచారణ చేసి నివేదిక సమర్పించారు. దాన్ని పరిశీలించిన సీపీ.. ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button