KhammamPoliticalTelangana

గిరిజనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు

గిరిజనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు

అడవిలో చెట్లు నరికే ప్రయత్నం చేసిన గిరిజనులు.. అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు పంచాయితీ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో గిరిజనులు, .పోడు భూముల పేరిట అటవీ ప్రాంతం లోని మొక్కలను స్థానిక గిరిజనులు,గ్రామస్తులు నరికివెస్తుండటం తో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు.

భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన స్థానిక అధికారులు పట్టించుకోవటం లేదని అందుకే అటవీ ప్రాంతం లోని చెట్లను తొలగిస్తున్నామని గిరిజనులు తెలుపుతున్నారు.

రెండు రోజుల్లో సర్వే నిర్వహిస్తామని అప్పటివరకు తమకు సహకరించాలని ఫారెస్ట్ అధికారులు గిరిజనులను కోరటం తో ఆందోళన సద్దుమణిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button