KhammamPoliticalTelangana

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకులు జావీద్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకులు జావీద్ మృతి

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకులు జావీద్ మృతి

ఖమ్మం హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఘటన

వేగంగా డివైడర్ని ఢీ కొట్టి.. ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు చెందిన జావిద్..

సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలింపు

నిన్న జావిద్ ను సన్మానించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు..

మహమ్మద్ జావేద్ మృతి పట్ల మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి

  • నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని ప్రకటన

ఖమ్మం : ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ దుర్మరణం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

సూర్యాపేట జిల్లా మోతే వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జావేద్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు.

ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావేద్, పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని మంత్రి కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు కలిగిన నాయకుడు జావేద్ అన్నారు.

ఆయన మరణం కాంగ్రెస్ శ్రేణులకు తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జావేద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button