Andhra PradeshPolitical

ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా!

ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా!

ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత సరదా!

చిత్తూరు జిల్లా వి.కోట మండలం మోట్లపల్లిలో గురువారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

వేసవి సెలవులు కావడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న వారంతా ఈతకు వెళ్లారు. నీట మునిగిన వారిని కాపాడేందుకు ఒడ్డున ఉన్న మరికొందరు విద్యార్థులు యత్నించారు. అప్పటికే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

మృతులను మోట్లపల్లి గ్రామానికి చెందిన కుషాల్‌, నిఖిల్‌, జగన్‌గా గుర్తించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు.ముగ్గురు యువకుల మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వేసవి సెలవుల్లో చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల మృతి ఎంతో దురదృష్టకరమన్నారు. ఈ విషయం ఆయన్ని ఎంతగానో కలచివేసిందని చెప్పారు. స్థానిక అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడి ఘటనపై వివరాలు ఆరా తీశారు.

గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button