
రోడ్డు ప్రమాదంలో భద్రాచలం టెంపుల్ ఇన్స్పెక్టర్ మృతి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
జూలై 24,
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో టెంపుల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రామిరెడ్డి శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారిపై ఆయన ద్విచక్ర వాహనంలో వెళుతుండగా సీఆర్పీఎఫ్ వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రామిరెడ్డిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




