PoliticalTelanganaWarangal

కాంగ్రెస్-బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత

కాంగ్రెస్-బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత

కాంగ్రెస్-బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత

నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముందుగా కాంగ్రెస్ శ్రేణులు వరంగల్ రోడ్డులోని కాకతీయ తోరణం వద్ద ధర్నా నిర్వహించారు.

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితి సద్దుమణిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button