PoliticalTelangana

మంత్రుల రాకతో మార్మోగిన ఖమ్మం

గ్రాండ్ ఎంట్రీ

– డిప్యూటీ సీఎం భట్టి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కు ఘన స్వాగతం

– నాయకన్ గూడెం వద్ద భారీ గజమాలతో అమాత్యులకు సాదర స్వాగతం

– ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు

– ప్రచారరథం పై ప్రజానీకానికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన అమాత్యులు

కూసుమంచి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఖమ్మం రావడంతో కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్ రెడ్డి, తుమ్మల తనయుడు యుగేందర్, రామూర్తి నాయక్, రామసహయం నరేష్ రెడ్డి , చావా శివ రామకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, కూసుమంచి మండల అధ్యక్షుడు మట్టే గురవయ్య, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్ , కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, కొంగర జ్యోతిర్మయి, యర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, మహమ్మద్ హాఫిజుద్దీన్, ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు , కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button