Andhra Pradesh

ప్రభుత్వాసుపత్రి వద్ద తాగుబోతు హల్‌చల్..

ప్రభుత్వాసుపత్రి వద్ద తాగుబోతు హల్‌చల్..

కుక్క పిల్లకు వైద్యం చేయాలని సిబ్బందితో వాగ్వాదం

Web desc : ప్రభుత్వాసుపత్రికి కుక్క పిల్లను తీసుకొచ్చి వైద్యం చేయాలంటూ ఓ తాగుబోతు హల్‌చల్ చేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి మద్యం సేవించిన ఓ వ్యక్తి ఔట్ పేషెంట్ విభాగం వద్దకు వచ్చి తన ఒళ్లో ఉన్న కుక్కపిల్లకు నీరసంగా ఉందని, వెంటనే వైద్యం చేయాలని కోరాడు.

దీంతో అతడి వాలకం చూసిన వైద్యులు ఇక్కడ కేవలం మనుషులకు మాత్రమే వైద్యం చేస్తారని, మీరు పశువుల ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆ తాగుబోతు మీరు డాక్టర్ చదువుకున్నారు కదా.. కుక్క పిల్లకు కూడా వైద్యం చేయాలని వారితో వాదనకు దిగాడు.

దీంతో ఆగ్రహించిన ఆసుపత్రి సిబ్బంది సెక్యూరిటీ సాయంతో ఈ తాగుబోతును ఆసుపత్రి బయటకు పంపించారు. అక్కడ కూడా అతడు సెక్యూరిటీ సిబ్బంది సహనం కోల్పోయేలా ప్రవర్తించి తీవ్ర ఘర్షణకు దిగాడు.

కానీ ఇంతకు ట్విస్ట్ ఏంటంటే.. అతడు ఓ కుక్క పిల్లను తీసుకువచ్చి పిల్లికి వైద్యం చేయమని అడగడం నవ్వులు పూయించింది. దీన్ని బట్టే అతడు ఏ స్థాయిలో మద్యం సేవించాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వాసుపత్రి వద్ద తాగుబోతు హల్‌చల్..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button