Andhra PradeshPolitical

మహిళా కానిస్టేబుల్ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

మహిళా కానిస్టేబుల్ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

మహిళా కానిస్టేబుల్ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

Social media : ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్‌ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది..

కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు..

ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. భర్త బండారాన్ని బయటపెట్టింది.. రెడ్‌ హ్యాండెడ్‌గా పెట్టుకుని.. పోలీసులకు అప్పగించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

మహిళా కానిస్టేబుల్‌ ఇంట్లో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ మహిళ.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.. తన కాపురంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్ బండారాన్ని బట్టబయలు చేసింది ఓ భార్య..

విజయనగరంలో సదరు మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే నిరసనకు కూర్చుంది ఆ మహిళ. నాతో కాపురం కాదని ఆ మహిళా కానిస్టేబుల్ తో తన భర్త సతీష్ సహజీవనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది..

తన భర్త సతీష్ ఆ కానిస్టేబుల్ తో ఇంట్లో ఉండగానే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రెండేళ్లుగా నన్ను విడిచి.. ఆ కానిస్టేబుల్ ఇంటిలోనే సతీష్ మకాం వేశాడని ఆరోపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నాని మధనపడుతుంది.

ఇంట్లో ఉన్న తన భర్త సతీష్ ను బయటకు పంపమని.. ఆ కానిస్టేబుల్ ఇంటి తలుపు కొట్టినా.. తీయడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చెసి సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గుట్టుకాస్తా బయటబయలు అయ్యింది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button